వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయం

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

● పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ‘అనంత’ ముఖ్య అతిథిగా, పార్టీ పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పేస్వామి విశిష్ట అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘అనంత’ మాట్లాడుతూ నగర పాలక సంస్థలోని 62 డివిజన్లతో పాటు మేయర్‌ పీఠాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, ఆయన అనుచరులు దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమం, చేసిన రూ.1,000 కోట్ల అభివృద్ధి ఒకవైపు... ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలు మరోవైపు ఉన్నాయని, వీటిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ మౌలిక వసతులు కల్పించామన్నారు. సర్వజనాసుపత్రి విస్తరణకు రూ.300 కోట్లు కేటాయించి సర్జికల్‌ బ్లాక్‌ నిర్మిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని విమర్శించారు. తమ పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల సూచనల మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. యువతకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు.

బాబు నైజం బయటపడింది..

అనంతపురం నగరాన్ని రూ.1,045 కోట్లతో అభివృద్ధి చేసిన వ్యక్తి అనంత వెంకటరామిరెడ్డి అని పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌ కుమార్‌ రెడ్డి కొనియాడారు. చంద్రబాబు హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేశారని, రెండున్నరేళ్లలోనే ఆయన నైజం బయటపడిందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్‌, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌, సీఈసీ సభ్యులు నదీం అహమ్మద్‌, మీసాల రంగన్న, ఎస్‌ఈసీ సభ్యులు లింగాల శివశంకర్‌ రెడ్డి, కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గౌస్‌బేగ్‌, వీరా రామకృష్ణా రెడ్డి, మాజీ మేయర్‌ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, పూజారి రాజశేఖర్‌ యాదవ్‌, గౌని నాగన్న, టీటీడీ మాజీ సభ్యుడు అశ్వత్తనాయక్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌రిజ్వాన్‌, జిల్లా అధ్యక్షుడు మొఘల్‌ సైఫుల్లా బేగ్‌, ఎగ్గుల శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, శివబాల, కేవీ రమణ, ఎద్దుల అమరనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement