తుదిపోరులో నెగ్గేదెవరో ? | - | Sakshi
Sakshi News home page

తుదిపోరులో నెగ్గేదెవరో ?

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

అనంతపురం: డాక్టర్‌ తాలిమెరెన్‌ ఆవో అండర్‌ – 19 బాలికల ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నీలో తుది పోరుకు రంగం సిద్ధమైంది. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా గ్రామం వేదికగా శుక్రవారం ఉదయం డిఫెండింగ్‌ చాంపియన్‌ మణిపూర్‌ జట్టు, వెస్ట్‌ బెంగాల్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నెల 10న ప్రారంభమైన టోర్నీలో మొత్తం 15 రాష్ట్రాల జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడ్డాయి.

మూడోసారి టైటిల్‌ కోసం..

ఇప్పటి వరకూ జరిగిన డాక్టర్‌ తాలిమెరెన్‌ ఆవో చాంపియన్‌ షిప్‌ టోర్నీల్లో మణిపూర్‌ జట్టే విజయప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. వరుస విజయాలతో రెండు పర్యాయాలు ట్రోఫీని కై వసం చేసుకున్న మణిపూర్‌ జట్టు ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను దక్కించుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌ బెంగాల్‌ జట్టు కూడా మణిపూర్‌ ఆశలను కల్లలు చేసేందుకు సరైన వ్యూహ రచనతో బరిలో దిగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement