పొద్దున లేచినప్పటి
నుంచి రాత్రి వరకూ ఆ పని, ఈ పనీ అంటూ పరుగులు తీస్తుంది. ఆమె కనులు
విప్పారకపోతే ఈ భూమికి తెలవారదు. గాజుల చేయి
కదలాడకపోతే ఏ మనుగడ
కొనసాగదు. ఆదిశక్తి
రూపం ఆమె. ఆమె
లాలనలో, పాలనలో
అందరూ పసివాళ్లే. ప్రతి చోటా ప్రేమగా అల్లుకుపోతుంది. ఆమె శ్రమ అంచనాలకు కూడా అందదు. ఆమె లేని జగతిలో దీపమే వెలుగదు. తన వాళ్ల కోసం ఓ మహిళ పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో. బతుకుదెరువు కోసం నగరం నుంచి పల్లెలకు వెళ్లి దుస్తుల వ్యాపారం చేసే ఓ మహిళ తన చిన్ని కుమార్తెను నడుముకు కట్టుకుని స్కూటర్‌లో వెళ్తున్న దృశ్యం పలువురిని ఆలోచింపజేసింది. బుక్కరాయసముద్రం వద్ద ఈ దృశ్యం కనిపించగా, ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. –సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


