ఆందోళనలు చేస్తే కర్రలతో కొడతారా? | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలు చేస్తే కర్రలతో కొడతారా?

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

● స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తాం

● మాజీ మంత్రి శైలజానాథ్‌

బుక్కరాయసముద్రం: ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తే కర్రలతో కొడతారా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్‌ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రివర్స్‌లో పోలీసులతో కేసులు పెట్టించడమేంటని మండిపడ్డారు. గురువారం మండల పరిధిలోని బొమ్మలాటపల్లిలో ఎర్రితాత కల్యాణ మండపంలో పార్టీ మండలాధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన నియోజక వర్గ అబ్జర్వర్‌ ఎల్‌ఎం మోహన్‌రెడ్డితో కలసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. ప్రతి పంచాయతీలో అభ్యర్థులను పోటీలో ఉంచుతామన్నారు. వారి గెలుపుకు కార్యకర్తలు విస్తృతంగా పని చేయాలన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్కరినీ మర్చిపోమన్నారు. అందుకే ఇప్పటికే ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులను కూడా ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్‌, యువ నాయకుడు డాక్టర్‌ సాకే రిత్విక్‌, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, నాగలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, ముసలన్న, వెంకటరెడ్డి, పార్వతి, పూల నారాయణస్వామి, లక్ష్మిరెడ్డి, నరేష్‌, మంత్రి ఆంజినేయులు, పద్మావతి, గుజ్జల పెద్దన్న, మల్లికార్జున, ముత్యాలశీన, ఆది, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, కాటమయ్య, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శైలజానాథ్‌

సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement