సోనామసూరి పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

సోనామసూరి పేరుతో మోసం

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

బొమ్మనహాళ్‌: సోనామసూరి బియ్యం పేరుతో రేషన్‌ బియ్యాన్ని విక్రయించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన బొమ్మనహాళ్‌ మండలంలోని నేమకల్లులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... నేమకల్లుకు బొలెరో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి సోనామసూరి బియ్యం విక్రస్తున్నామని చెప్పాడు. శాంపుల్‌గా కొంత బియ్యం చూపించి, బయట మార్కెట్‌లో క్వింటా బియ్యం రూ.7 వేలు పైనే ఉందని, తమ వద్ద కేవలం రూ.4,300కే విక్రయిస్తున్నట్లు నమ్మించాడు. దీంతో గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి బియ్యం బాగున్నాయని.. మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకే బియ్యం వస్తాయని ఆశతో క్వింటా రూ.4,300 ప్రకారం 3 క్వింటాళ్ల బియ్యాన్ని రూ. 12,900లకు కొనుగోలు చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో అన్నం చేసుకునేందుకు బియ్యం బస్తాను తెరచి చూడగా..అందులో సోనామసూరి బియ్యం కాకుండా రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయిన్నట్లు తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. బియ్యం విక్రయించిన వ్యక్తి కోసం గాలించిన్పప్పటికీ అప్పటికే అతడు వాహనంతో వెళ్లిపోయిన్నట్లు బాధితుడు తెలిపారు. సీసీ కెమెరాల్లో దొరికిన వీడియోలతో పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

రెన్యూవల్‌ చేయని

మద్యం షాపులకు నోటిఫికేషన్‌

● అక్టోబర్‌ 1 వరకూ దరఖాస్తుకు గడువు

● 5న లాటరీ ద్వారా ఎంపిక

అనంతపురం సెంట్రల్‌: రెన్యూవల్‌ చేయని మద్యం షాపులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 138 మద్యం షాపులకు రెన్యూవల్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. అయితే వివిధ కారణాలతో ఓపెన్‌ కేటగిరీలో మొత్తం 50 మద్యం షాపులు, 3 గీత కులాలకు సంబంధించిన షాపులు రెన్యూవల్‌ కాలేదన్నారు. అనంతపురంలో 15, తాడిపత్రి 12, గుత్తి 7, గుంతకల్లు 4, కణేకల్‌ 1, కళ్యాణదుర్గం 4, కంబదూరు 5, రాయదుర్గం 3, బుక్కరాయసముద్రం 2 మద్యం షాపులు నోటిఫై చేశామన్నారు. వీటిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందజేయవచ్చన్నారు. అక్టోబర్‌ 1వ తేదీ రాత్రి 11.59 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 5న ఉదయం 8 గంటలకు జిల్లా పరిషత్‌ ఆవరణలోని డీపీఆర్‌సీ మీటింగ్‌ హాల్లో లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement