ప్రైవేటుకు ఎలక్ట్రిక్‌ బస్సులు వద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు ఎలక్ట్రిక్‌ బస్సులు వద్దు

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

అనంతపురం క్రైం: ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అవసరమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి సిబ్బందితో నిర్వహించాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణపై ప్రభుత్వం మళ్లీ ఆలోచిస్తే ఉద్యోగ సంఘాల జేఏసీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని వీకే భవన్‌లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. విజయ్‌భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి కె. కొండయ్య ఆధ్వర్యంలో విస్తృతస్థాయి కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా దామోదరరావు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోలు, రూట్లు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. రద్దీకి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులను సమకూర్చాలని డిమాండ్‌ చేశారు. కడప జోన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు పీ.ఎస్‌. ఖాన్‌ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిపై నాన్‌ బెయిలబుల్‌న కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement