జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వాయువ్య దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వాయువ్య దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

‘ప్రత్యామ్నాయం’ దిశగా

రైతులను ప్రోత్సహించండి

అనంతపురం అర్బన్‌: కొర్రలు, జొన్నలు, ఉలవలు, అలసందలు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంట విత్తనాలను 80 శాతం సబ్సిడీతో ఇస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు వర్షపాతం 36 శాతం తక్కువగా నమోదైందన్నారు. జిల్లావ్యాప్తగా 3.43 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.78 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయన్నారు. మిగిలిన భూమిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని చెప్పారు. నెలాఖరులోగా ఈ–పంట డిజిటల్‌ క్రాప్‌ సర్వే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 302 రైతు సేవా కేంద్రాల పరిధిలో హాఫ్‌ మూన్‌ మోడల్‌లో కేటాయించిన పంటల సాగు లక్ష్యం పూర్తి కావాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, డీసీఓ అరుణకుమారి, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, డీఎస్‌ఓ శోభారాణి, మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్‌, ఎల్‌డీఎం మారుతీ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ శైలజ, ఉద్యానశాఖాధికారి రత్నకుమార్‌, మత్స్యశాఖ అధికారి విజయకృష్ణ, ఏపీసీఎన్‌ఎఫ్‌ ఎస్‌పీఎం నవీన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement