ఆస్తి పంచివ్వలేదని ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పంచివ్వలేదని ఆత్మహత్యాయత్నం

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

తల్లి, ఇద్దరు బిడ్డలను

రక్షించిన పోలీసులు

శింగనమల: ఆస్తి పంపకాలు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి తన కుమారుడు, కుమార్తెతో కలిసి చెరువులోకి దూకేందుకు యత్నించిన ఘటన శింగనమల వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీ భర్త ఆంజనేయులు 10 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి ఒక కుమారుడు (16 ఏళ్లు), కుమార్తె (17 ఏళ్లు) సంతానం. ఇటీవల చాకలి లక్ష్మీకి ఆస్తి పంపకాలు చేసివ్వకుండా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన బిడ్డలతో కలిసి శనివారం శింగనమల చెరువు వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలో రోడ్డు పని చేస్తున్న కూలీలు వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ ఆశోక్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ బాషా, పీసీ సంపత్‌లు ఘటనాస్థలికి చేరుకుని తల్లీబిడ్డలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ ప్రసాద్‌ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement