జీఎస్‌బీసీకి నీరు వదలాలి | - | Sakshi
Sakshi News home page

జీఎస్‌బీసీకి నీరు వదలాలి

Sep 13 2026 7:34 AM | Updated on Sep 13 2026 7:34 AM

గుంతకల్లు రూరల్‌: ‘తీవ్ర వర్షాభావం, రోజురోజుకూ అడుగంటిపోతున్న భూగర్భ జలాల కారణంగా గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజల గొంతెండుతుంది. కనీసం ఇప్పటికై నా గుత్తి సబ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ (జీఎస్‌బీసీ) ద్వారా నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చాలి’ అని రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల రైతులు ఆందోళన చేపట్టారు. హంద్రీ–నీవా జలాల పంపిణీ తమ చేతుల్లో లేదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం నియోజకవర్గ కార్యదర్శి బాబూరావు, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement