పామిడి/అనంతపురం: అంతర్జాతీయ రెజ్లింగ్ సెలెక్షన్ ట్రయల్స్‌కు స్థానిక ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని కొప్పల అనూష ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు. ఈ నెల 20 నుంచి రెండు రోజుల పాటు చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో జరగనున్న ట్రయల్స్‌లో అనూష పాల్గొంటుందన్నారు. అండర్–17 కేటగిరీలో 40 కిలోల విభాగంలో కొప్పల అనూష పాల్గొని తన ప్రతిభను చాటుకోనున్నారు. ఈ పోటీల్లోనూ రాణించి దక్షిణ అమెరికాలోని రియో డి జనీరోలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని ప్రయాణ ఖర్చుల నిమిత్తం అధ్యాపకులు చందారూపాన రూ.11,500 వసూలు చేసి అందజేశారు.
● అనూష ప్రయాణ ఖర్చులను తాను భరిస్తానంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భరోసానిచ్చారు. దీంతో శుక్రవారం ఎమ్మెల్యేను అనూష కలిసి కృతజ్ఞతలు తెలిపింది. అనూష వెంట డీఎస్‌డీఓ మంజుల, భారత కుస్తీ కోచ్ ఎన్.రాఘవేంద్ర ఉన్నారు.


