బుక్కరాయసముద్రం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సాధారణ ప్రజలకే కాదు.. దేవుళ్లకూ నీటి కష్టాలు తప్పడం లేదు. బీకేఎస్ మండలం మీదుగా వెళ్తున్న హెచ్‌ఎల్‌సీలో ఈ సారి నీటి జాడ కరువైంది. కాలువకు నీరు వదలాలని ప్రజలు, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు పాలకులను అనేకసార్లు కోరినా పట్టించుకోలేదు. దీంతో రైతులు, ప్రజలు సాగు,తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రావడం, లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి కూడా నీరు కరువవడంతో చేసేదిలేక వెంకటాపురం, దయ్యాలకుంటపల్లికి చెందిన ప్రజలు ఒట్టి కాలువలోనే వినాయకులను వదిలేసి వచ్చారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదని, కనీసం వినాయక చవితికి అయినా కాలువకు నీరు వదలక పోవడం దారుణమని పలువురు మండిపడ్డారు.


