విడపనకల్లు: మండల పరిధిలోని పొలికి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి తన 12 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంటను గురువారం తొలగించాడు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ)కు సాగు నీరు వస్తాయనే ఆశతో నెల రోజుల క్రితం రూ.12 లక్షలు ఖర్చు చేసి వెంకటేశ్వరరెడ్డి మిరప సాగు చేశాడు. అయితే, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ సాగు నీరు విడుదల కాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. దీంతో దిక్కుతోచని వెంకటేశ్వర రెడ్డి ట్రాక్టర్‌తో పంటను తొలగించాడు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలకు కనీసం సాగు నీరు ఇవ్వలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు.


