చెదుళ్లలో మహిళపై దాడి | - | Sakshi
Sakshi News home page

చెదుళ్లలో మహిళపై దాడి

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని చెదుళ్ల గ్రామంలో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. చెదుళ్లలో దళిత వర్గానికి చెందిన శ్రీదేవికి 15 ఏళ్ల క్రితం నరసింహారెడ్డితో ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శ్రీదేవి చెదుళ్లలో అవ్వ ఇంట్లో ఉంటోంది. శ్రీదేవి సొంత పిన్ని అయిన నారాయణమ్మ, ఆమె కుమారులు కుళ్లాయప్ప, నారాయణలు శ్రీదేవి ఇంట్లో ఉన్న సామాన్లను బయటకు విసిరేశారు. పిల్లలను బయటకు ఈడ్చి కొట్టి గ్రామంలో ఉండడానికి వీల్లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. అఽధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement