గుత్తి: పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మనోజ్ అనే ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ఆరో తరగతి విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల పట్టణంలోని శ్యాం నగర్‌కు చెందిన శివమద్దిలేటి, శ్రీలక్ష్మిదేవి దంపతుల కుమారుడు మనోజ్ (26) గుత్తి మండలం సేవాఘడ్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత ఆరో తరగతి విద్యార్థి రిషిద్‌తో కలిసి బైక్‌లో గుత్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో చెరువు కట్ట వద్ద గుంతకల్లు డిపో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన పీడీ మనోజ్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి రిషిద్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మనోజ్ పీడీగా ఎంపికయ్యారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన ఆయన అర్ధంతరంగా తనువు చాలించడం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. ఘటనపై సీఐ రామారావు విచారణ చేపట్టారు.
విద్యార్థికి తీవ్ర గాయాలు


