అనంతపురం మెడికల్‌ కాలేజీకి జాతీయ స్థాయిలో 127వ ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

అనంతపురం మెడికల్‌ కాలేజీకి జాతీయ స్థాయిలో 127వ ర్యాంక్‌

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

అనంతపురం సిటీ: జాతీయ స్థాయిలోని మెడికల్‌ కళాశాలలకు ఇండియన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐఐఆర్‌ఎఫ్‌) 2026 సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు 127వ ర్యాంక్‌ దక్కింది. దేశీయంగా ఎంపిక చేసిన 144 కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు, వైద్య విద్య నాణ్యత, పరిశోధన, వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, విద్యార్థుల ప్లేస్‌మెంట్‌, కేరీర్‌ అవకాశాలు, బాహ్య నిపుణుల అభిప్రాయాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ర్యాంక్‌లను ఐఐఆర్‌ఎఫ్‌ ప్రకటించింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మెడికల్‌ కళాశాలలకు ఉత్తమ ర్యాంక్‌ దక్కడం గమనార్హం. జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్‌తో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత గుంటూరు మెడికల్‌ కళాశాలకు 50వ ర్యాంక్‌, కర్నూలు మెడికల్‌ కళాశాలకు 57వ ర్యాంక్‌, కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌కు 59వ ర్యాంక్‌, తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌కు 69వ ర్యాంక్‌, విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌కు 109వ ర్యాంక్‌ దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement