అధికారులు అనుకున్నట్టే చేశారు | - | Sakshi
Sakshi News home page

అధికారులు అనుకున్నట్టే చేశారు

Aug 8 2026 12:17 AM | Updated on Aug 8 2026 12:17 AM

రాప్తాడు రూరల్‌: పుల్లలరేవు గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఓబులేసు, వసంతుకు చెందిన సాగుభూమి విషయంలో రెవెన్యూ అధికారులు అనుకున్నట్టే చేశారు. శుక్రవారం వారు వ్యవహరించిన తీరుపై వివాదం నెలకొంది. కనీసం నోటీసు ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో వ్యవసాయ బోరు, పైపులైన్లు, కేబుల్‌ ను తొలగించడంతో పాటు తోటలోని చెట్లకు నీరు అందకుండా చేశారని బాధిత రైతు కుటుంబం ఆరోపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోనే తమను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్‌ తహసీల్దారు చెన్నకేశవులు, సీఐ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. రైతు పెద్ద ఓబులేసు, ఆయన తల్లి నాగలక్ష్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తోటలోని మోటారు, పైపులైన్లు, కేబుల్‌వైర్లను తొలగించి తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. దీంతో తోటలోని చెట్లకు నీరు అందకుండా పోయిందని రైతు కుటుంబం వాపోయింది.

రైతు తల్లిని అదుపులోకి తీసుకుంటున్న మహిళా పోలీసులు

ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌, సీఐ సమక్షంలో మోటారు, బోరు, పైపులు తొలగిస్తున్న దృశ్యం

బాధిత రైతుకు నోటీసు లేకుండానే బోరు, పైపులైన్ల తొలగింపు

పోలీసుల సమక్షంలో వ్యవసాయ పరికరాలు స్వాధీనం

కుటుంబ సభ్యుల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement