●రైతు కష్టం నేలపాలు | - | Sakshi
Sakshi News home page

●రైతు కష్టం నేలపాలు

Aug 8 2026 12:17 AM | Updated on Aug 8 2026 12:17 AM

గుమ్మఘట్ట: టమాట ధరలు దారుణంగా పడిపోయాయి. రైతు కష్టార్జితం నేలపాలయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్‌, రాయదుర్గం, డి.హీరేహాళ్‌ మండలాల్లో 1,500 ఎకరాల విస్తీర్ణంలో టమాట సాగైంది. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. అనంతపురం, బళ్లారి మార్కెట్లకు తీసుకెళ్తే.. 15 కిలోల టమాటాల బాక్సు రూ.80 పలికింది. కూలీలు, రవాణా ఖర్చులకు కూడా చాలడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు కాకపోవడంతో టమాటాలను రోడ్డపక్కన పారబోసి పోతున్నారు. టమాటాలకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement