ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యక్ష ఆదేశాలతో బోయ కులానికి చెందిన పేద రైతుపై అధికారులు కక్షకట్టి వ్యవహరిస్తున్నారు. ఇది దుర్మార్గానికి పరాకాష్ట. ఈ భూమి విషయంలో కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ బాధిత రైతుకు కనీసం నోటీసు ఇవ్వకుండా, ఆయన వద్దనున్న ఆధారాలు పరిశీలించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. తాను ఇన్‌చార్జ్ తహసీల్దారుకు ఫోన్ చేసినా స్పందించలేదు. వాయిస్ మెసేజ్ పెట్టినా పట్టించుకోలేదు. ఈ అధికారి ‘ఎస్‌ఐఆర్’లోనూ ప్రసన్నాయపల్లిలో ఏకపక్షంగా దొంగ ఓట్లు ఎక్కించారు. ఆయనకు పరిటాల సునీత కొమ్ము కాస్తున్నారు. బాధిత రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. అయినా న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం.
– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే


