సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం. 15 ఏళ్లుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకలా సేవలందిస్తున్న ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు జమయ్యేలా శాశ్వత వ్యవస్థను అమలు చేయాలి. అలాగే మినిమమ్ టైమ్ స్కేల్ జీఓలను అమలు చేసి, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీని నెరవేర్చాలి.
– కె.విజయ్, సమగ్రశిక్ష ఉద్యోగుల ఫోరం జేఏసీ చైర్మన్


