మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు, టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ సోమవారం ఉరవకొండలో నిర్వహించే శాంతియుత ధర్నాకు అడ్డంకులు సృష్టించడం తగదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ధర్నాను విఫలం చేయడానికి అధికార పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ఇక్కడ పట్టించుకోవడం లేదన్నారు. జూలై 31వ తేదీనే ధర్నాకు పిలుపునిస్తే.. అనుమతి ఇవ్వకుండా వాయిదా వేసుకోవాలని తెలిపితే పోలీసులను గౌరవించి సోమవారానికి వాయిదా వేశామన్నారు. ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకుని, ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


