బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయం | - | Sakshi
Sakshi News home page

బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయం

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

అనంతపురం కల్చరల్‌: బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయమని, ఆయన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని వక్తలన్నారు. ఆదివారం రాత్రి బళ్లారి రాఘవ 146వ జయంతి స్థానిక లలితకళాపరిషత్‌లో ఘనంగా జరిగింది. ఎల్కేపి కార్యదర్శి పద్మజ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్వో మలోల, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ దుర్గాప్రసాద్‌, ఎల్కేపి అధ్యక్షుడు సీనియర్‌ న్యాయవాది గురుప్రసాద్‌, ఉపాధ్యక్షుడు సంగాల నారాయణస్వామి, రామగోవిందసాగర్‌ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బళ్లారి రాఘవ ఆదర్శప్రాయ జీవితాన్ని గురించి రంగస్థలానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బళ్లారి రాఘవ పురస్కారాలకు ఎంపికై న రాష్ట్రస్థాయి విభాగంలో డీసీ కృష్ణ, జంగం ధర్మారావు జిల్లా విభాగంలో సోమిరెడ్డి, ఎర్రిస్వామి, జేకే రామాంజనేయులు, నారాయణస్వామి, ఉంగరాల శ్రీనివాసులు, ఆముదాల సుబ్రమణ్యం, వరప్రసాద్‌లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలనందించారు. అనంతరం ప్రదర్శించిన ‘శ్రీపోతులూరి వీరబ్రహ్మంద్రస్వామి జీవిత చరిత్ర’ చారిత్రక నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో లలితకళాపరిషత్‌ కార్యనిర్వాహక సభ్యులు ఆదినారాయణరెడ్డి, శంకర్‌, రమణారెడ్డి, అస్లాంబాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement