● 321 పరుగులకు ఆలౌటైన ‘అనంత జట్టు’
అనంతపురం న్యూటౌన్: జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి మరోసారి సత్తాచాటాడు. సీనియర్ అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో సెంచరీ చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనంతపురం ఆర్డీటీ మైదానంలో నిర్వహిస్తున్న సీనియర్ అంతర్ జిల్లాల సౌత్ జోన్ క్రికెట్ పోటీలు గురువారం కూడా కొనసాగాయి. అనంతపురం – కడప జట్ల జరుగుతున్న మ్యాచ్‌లో తొలిరోజు కడప జిల్లా జట్టు 344 పరుగులు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. రెండోరోజు ఆటలో అనంతపురం జట్టు 321 పరుగులు చేసింది. మచ్చా దత్తారెడ్డి 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 పరుగులు, రోహిత్ రోషన్ 39 , వీరారెడ్డి 46 ,రాజకుళ్లాయప్ప 39 పరుగులు సాధించారు. 321 పరుగులకు అనంతపురం జిల్లా జట్టు ఆలౌట్ అయింది. కడప బౌలర్లు చెన్నారెడ్డి, వరుణ్ తేజారెడ్డి, విజయ్ భార్గవ్, షరీఫ్ తలో 2 వికెట్లు చోప్పున తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కడప జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు సాధించింది. శుక్రవారం మూడోరోజు ఆట కొనసాగనుంది.
ఎస్కేయూ పాలక మండలి రద్దు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలిని రద్దు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023 సెప్టెంబర్ 1న ఎస్కేయూ పాలకమండలి సభ్యులను నియమించగా.. తాజాగా కొత్త సభ్యులను నియమించే ఉద్దేశంతో రద్దు చేశారు. ఈ క్రమంలో పాలకమండలిలో చోటు దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.


