పెద్దపప్పూరు: పెద్దపప్పూరు పోలీసులు ఇద్దరు అంతర్ జిల్లాల బైకు దొంగలను శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ నరేందర్ రెడ్డి,ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చీమలవాగుపల్లికి చెందిన లోకేష్, తాడిపత్రికి చెందిన సురేష్ జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టారు. ఇద్దరూ కలిసి అనంతపురం, కర్నూలు, నంద్యాల, బళ్లారి జిల్లాల పరిధిలో కొన్ని రోజులుగా బైకులు చోరీ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. శుక్రవారం లోకేష్, సురేష్‌ను అదుపులోకి తీసుకొని వారి నుంచి 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ నరేందర్ రెడ్డి చెప్పారు.


