● భారీ కాన్వాయ్‌తో స్వగ్రామానికి..
● తోపుదుర్తిలో ఘన స్వాగతం
రాప్తాడురూరల్/ఆత్మకూరు: రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కాగా...హైకోర్టు లో ఊరట లభించింది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు (క్రైమ్ నెం.84/2025)లో తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి సుమారు 45 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో, కక్షపూరితంగా పెట్టిందని కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంటున్నారు. ఆయనకు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా.. శుక్రవారం జామీన్లు సమర్పించి రెడ్డిపల్లి సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటికే లాయర్లు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో అనంతపురం మీదుగా స్వగ్రామమైన ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాకుండా ప్రజలు పెద్దఎత్తున స్వాగతించారు. రాజశేఖర్‌రెడ్డిని భుజాలపై ఎత్తుకుని ఇంటి వరకు తీసుకెళ్లారు. అక్రమ కేసులో అన్యాయంగా అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడ్డారు.
తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో కుటుంబ సభ్యుల సంతోషం
తోపుదుర్తి గ్రామంలో రాజశేఖర్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యం


