కుందుర్పి: జిల్లాలోని కొనకొండ్ల, కుందుర్పి, గోనబావి, నార్పల, డీ హీరేహాళ్ మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో 2026–2027 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశానికి గాను ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ అస్రత్‌వలి తెలిపారు. శనివారం ఆయన కుందుర్పిలో మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,956 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.


