పూలే ఆశయాలు కొనసాగిస్తాం | - | Sakshi
Sakshi News home page

పూలే ఆశయాలు కొనసాగిస్తాం

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

అనంతపురం : మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అనంత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయనబాటలోనే నడుస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ అని నమ్మి, వారి అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ పూలే స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితో విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి, పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేలా చూశారన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్‌ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బడుగులను నట్టేట ముంచుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా.. డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలయాపన చేస్తోందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు దన్నుగా నిలిచిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, ఎస్‌ఈసీ సభ్యుడు లింగాల శివశంకర్‌ రెడ్డి, మాజీ మేయర్‌ వసీం, నాటక అకాడమీ మాజీ చైర్‌పర్సన్‌ రాగే హరిత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, భారతి, పద్మ, శోభారాణి, అంజలి, లక్ష్మి, పార్వతి, దేశాయి భారతి, చంద్రకళ, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, నాయకులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, రిలాక్స్‌ నాగరాజు, లక్ష్మన్న, శ్రీనివాస్‌ నాయక్‌, జానీ, థామస్‌, దాదా ఖలందర్‌, సాకే అశోక్‌కుమార్‌, వెన్నపూస రామచంద్రారెడ్డి, మాలపాటి శ్రీనివాసులు, కమల్‌ భూషణ్‌, రామచంద్ర, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement