ఎస్కేయూ వీసీగా జ్యోతి కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ వీసీగా జ్యోతి కుమార్‌

Mar 14 2026 7:44 AM | Updated on Mar 14 2026 7:44 AM

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నూతన వైస్‌ చాన్సలర్‌ గా ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌/ చాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌వీఆర్‌ విజయ్‌కుమార్‌ మిజోరాం యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 39 సంవత్సరాల బోధనానుభవం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎస్కేయూకు శాశ్వత వీసీ నియామకం జరిగింది. 18 నెలలుగా ఇన్‌చార్జ్‌ వీసీతోనే ఎస్కేయూ కార్యకలాపాలు జరిగాయి. ఎస్కేయూ ఇన్‌చార్జ్‌ వీసీగా ప్రొఫెసర్‌ బి.అనిత ఎక్కువ కాలం పనిచేసి రికార్డు సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement