అన్నదాత సుఖీభవ ఊసేలేదు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సుఖీభవ ఊసేలేదు

Mar 14 2026 7:44 AM | Updated on Mar 14 2026 7:44 AM

సొంత భూమి లేని నేను దోసలుడికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ భూమిలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాను. వర్షాభావం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టాలు వస్తున్న తరుణంలో కౌలు డబ్బులు చెల్లించడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంది. అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు.. ఇంత వరకూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. రైతుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు?

– చిప్పగిరి రంగడు, కౌలు రైతు,

దోసలుడికి, గుంతకల్లు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement