అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ అనంతపురం రామ్‌నగర్ సబ్ రిజి స్ట్రార్‌గా కవిరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కవిరాజు ఇటీవలే గ్రూప్–2లో ఉత్తీర్ణత సాధించి సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. రిజిస్ట్రేషన్ అధికారులు శిక్షణలో భాగంగా అనంతపురం సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది పాటు రామ్‌నగర్ ప్రధాన కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించనున్నారు.
పెన్నహోబిలం ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం
ఉరవకొండ: మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనృసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్‌గా రాయంపల్లి గ్రామానికి చెందిన రేగాటి నాగరాజుతో పాటు 12 మంది పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈఓ తిరుమలరెడ్డి సమక్షంలో పాలక మండలి సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెన్నహోబిళం ఆలయ అభివృద్ధికి కృషి చేసి, ఆలయంలో భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు పాలక మండలి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
ఉరవకొండలో
సినిమా షూటింగ్ సందడి
ఉరవకొండ: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పాత తహసీల్దార్ భవనంలో శుక్రవారం నూతన చిత్రం షూటింగ్ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. చిత్ర డైరెక్టర్ విహారి వివరాలు తెలియజేశారు. భగవంతుడు అనే పేరుతో ప్రారంభమైన ఈ చిత్రంలో హీరోగా తిరువీర్, హీరోయిన్‌గా జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొందరు సీనియర్ నటులు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా రవి వ్యవహరిస్తున్నారని, ఉరవకొండ, పెన్నహోబిలం తదితర ప్రాంతాల్లో 20 రోజుల పాటు షూటింగ్ చేస్తున్నామన్నారు.
మొల్లమాంబ జీవితం స్ఫూర్తిదాయకం
అనంతపురం అర్బన్: కవయిత్రి మొల్లమాంబ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయమని డీఆర్‌ఓ ఎ.మలోల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో మొల్లమాంబ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వెంకటశివుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు పాల్గొని మాట్లాడారు. కవయిత్రి మొల్లమాంబ ఎలాంటి రాజపోషణ లేకుండా భక్తి, ప్రతిభతో రామయణాన్ని తేట తెలుగులో అందించిన మహనీయురాలని కొనియాడారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లోనే సంస్కృతం నుంచి సరళంగా అందరికీ అర్థమయ్యేలా తెలుగుభాషలో అనువదించారన్నారు. ఈ రోజు సామాన్యులు సైతం రామాయణాన్ని చదువుతున్నారంటే ఆ ఘనత మొల్లమాంబకే దక్కుతుందన్నారు. అనంతరం నృత్య ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్, ఆరే కటిక సంక్షేమ సంస్థ చైర్మన్ హరికృష్ణరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసింహమూర్తి, శాలివాహన ఉద్యోగ సంఘం నాయకుడు ఓబుళపతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీరమణ, మహిళ నాయకురాలు రామాంజినమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. భి,ష్ళఔ్ఛుఽౌఠిౌ


