● రూ.2,39,900 స్వాధీనం
తాడిపత్రి రూరల్: మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి 12 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు.. మండలంలోని చుక్కలూరు గ్రామ సమీపంలోని మామిడితోట పేకాట కేంద్రంపై దాడి చేసి 8 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సురేష్, వెంకటశ్రీకాంత్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఓబుళరాజు, మహమ్మద్‌యుసఫ్, రామాంజినేయులు, అల్లాబకాష్, రామకృష్ణను అరెస్టు చేశామన్నారు. అలాగే మండలంలోని తలారిచెరువు వద్ద గల అదాని సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని కంపచెట్లల్లో పేకాట ఆడుతున్నా అజయ్, రామచంద్ర, వెంకటేష్, రంగస్వామిని అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ.89,900, మూడు మోటర్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
పాత స్తంభాలతో ప్రమాదం
● విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మార్చాలని సిబ్బందికి ఎస్‌ఈ ఆదేశం
గార్లదిన్నె: ప్రమాదకరంగా ఉన్న పాత స్తంభాలను వెంటనే మార్పు చేయాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మర్తాడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో పర్యటించారు. అక్కడక్కడా పాత కాలం నాటి ఇనుప విద్యుత్ స్తంభాలు కనిపించాయి. వర్షాలు కురిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉన్న 15 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 100 కేవీ సామర్థ్యమున్నవి ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌ఈ వెంట ఏడీ రఘు, ఏఈ విజయ్‌కుమార్, రైతులు తాతిరెడ్డి, ఆవుల క్రిష్టయ్య, వెంకటేష్, ఓబులపతి తదితరులు ఉన్నారు./ాష్ళఔ్ఛుఽౌఠిౌ


