● రెండు రోజుల పాటు కార్యక్రమాలు )/ష్ళఔ్ఛుఽౌఠిౌ
గుత్తి: గుత్తి కోట ఉత్సవాలు ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజులు పాటు కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో భారీ స్టేజ్‌తో పాటు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. 14వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు గుత్తి కోట ఉత్సవాలు ప్రారంభమై రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డాన్స్‌లు, కోలాటం, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఉంటాయి. మెగా మ్యూజికల్ ఈవెంట్ కూడా ఉంటుంది. కూచిపూడి, భరత నాట్యం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు రానున్నారు. 15న ఉదయం 9 గంటలకు రెవెన్యూ కార్యాలయం వద్ద నుంచి కోట వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి అతిథుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ ఫేం శాంతికుమార్, రైజింగ్ రాజు, మోహన్ కళాకారులచే కామెడీ షోను ప్రదర్శిస్తారు. కోట ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కోట ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ పుష్పావతి పర్యవేక్షించారు.
ఏర్పాట్లను పరిశీలించిన జేసీ
గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు. స్థానిక ఎంఎస్ ఫుట్‌బాల్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసి భారీ స్టేజ్, స్టాల్స్‌ను పరిశీలించారు. కోట ఉత్సవాలను ఘనంగా , పకడ్బందీగా నిర్వహించాలని , ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ,9/ÚåLenovo


