అనంతపురం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మహిళా దినోత్సవం నిర్వహణపై ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులకు తగిన సూచనలిచ్చారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభించాలన్నారు. మహిళ సాధికారత, లింగ వివక్ష, బాల్య వివాహాల నిర్మూలనతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వారిని అతిథుల ద్వారా సత్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్ని జయప్రదం చేయాలన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.


