నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలుపుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే రసీదు తీసుకురావాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఇక పరిష్కారవేదిక కలెక్టరేట్‌లోనే కాకుండా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లోనూ జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in లోనూ సమర్పించవచ్చని పేర్కొన్నారు.
కఠిన చర్యలు తీసుకోండి
బొమ్మనహాళ్: ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలోకి వెళ్లి తిరిగి వస్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, పార్టీ నాయకులపై దాడి చేసిన టీడీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆదివారం సాయంత్రం బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రవిబాబు, సీఐ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. మెజార్టీ లేకపోయినా తమకే ఎంపీపీ పదవి కావాలంటూ.. కాదు, కూడదని జోక్యం చేసుకుంటే అంతు చూస్తాం అంటూ టీడీపీకి చెందిన రౌడీమూకలు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఏపీఎన్‌జీజీవో
అధ్యక్షునిగా మాధవ
అనంతపురం అర్బన్: ఏపీఎన్‌జీజీఓ (ఆంధప్రదేశ్ నాన్‌గెజిటెడ్, గెజిటెడ్ అధికారులు) సంఘం జిల్లా అధ్యక్షునిగా జె.మాధవ్, కార్యదర్శిగా ఎ.రవికుమార్ ఎన్నికయ్యారు. సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం నగరంలోని ఎన్‌జీఓ హోమ్‌లో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌యాదవ్ వ్యవహరించారు. సంఘంలోని 17 స్థానాలకు సింగిల్ సెట్ నామినేషన్ దాఖలు కావడంతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించి డిక్లరేషన్ అందజేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామన్నారు.
నూతన కమిటీ..
ఏపీఏఎన్‌జీజీఓ జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా జె.మాధవ్, కార్యదర్శిగా ఎ.రవికుమార్, అసోసియేట్ అధ్యక్షునిగా డి.చంద్రమోహన్, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా పి.శ్రీధర్‌బాబు, జమీలాబేగం, అనంతయ్య, లక్ష్మీనారాయణ, లింగమేష్, దస్తగిరి ఎన్నియ్యారు. ఆర్గనైజింగ్ కాక్యదర్శిగా వెంకటేష్‌బాబు, సంయుక్త కార్యదర్శులుగా వెంకటరాముడు, లక్ష్మీనరసయ్య, వంశీబాబు, పద్మావతి, రుషికేష్, ఉమాశంకర్ ఎన్నికయ్యారు.
నేడు అనంత వెంకటరెడ్డి వర్ధంతి
అనంతపురం: జిల్లా రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నేటి తరం రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయంగా నిలిచిన మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి సోమవారం నిర్వహించనున్నారు. అనంతపురం సర్వజనాసుపత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు నివాళి అర్పించనున్నారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’


