కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు? | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

Jan 4 2026 7:08 AM | Updated on Jan 4 2026 7:08 AM

కొత్త

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

న్యూస్‌రీల్‌

చీనీ టన్ను రూ.17 వేలు
అనంతపురం మార్కెట్‌ యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.17 వేలు, కనిష్టం రూ.10 వేలు పలికాయి.

ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026

రేపటి నుంచి

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు

అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు జరగనున్నాయని డీఆర్‌ఓ మలోల స్పష్టం చేశారు. ఐదు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఆరు రోజుల పాటు జరగనున్న పరీక్షలకు మొత్తం 2,488 మంది ఉద్యోగులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు బందోబస్తు కల్పించాలన్నారు. విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు.

రేపటిలోగా తత్కాల్‌ కింద ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు

అనంతపురం సిటీ: ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఈ నెల 5లోగా పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఇంటర్‌ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణనాయక్‌ శనివారం తెలిపారు. తత్కాల్‌ కింద రూ.5 వేల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉపాధ్యాయులే

సమాజ నిర్మాతలు

అనంతపురం సిటీ: ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని చిత్తశుద్ధితో పని చేసి విద్యార్థులను జాతి రత్నాలుగా తీర్చిదిద్దాలని డీఈఓ ప్రసాద్‌బాబు కోరారు. ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (అప్టా) ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర నూతన క్యాలెండర్లు, డైరీలను డీఈఓ తన చాంబర్‌లో యూనియన్‌ ప్రతినిధులతో కలసి శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి ఆయన పై విధంగా స్పందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ కడప మునీర్‌, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు, ఆత్మకూరు ఎంఈఓ నరసింహారెడ్డి, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, వెంకటరత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి శంకర్‌మూర్తి పాల్గొన్నారు.

అనంతపురం టవర్‌క్లాక్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాలైంది. ఇప్పటి వరకు సామాజిక భద్రత కింద కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. అర్హులైన వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు తదితరులు పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త పింఛన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన అనంతపురంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్‌ ఆనంద్‌, జెడ్పీ సీఈఓ శివశంకర్‌ హాజరయ్యారు. బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా కొత్తగా సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛన్‌ ఇస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చినదేమీ లేదన్నారు. దరఖాస్తు చేయడానికి వెబ్‌సైట్‌ కూడా ఓపెన్‌ కావడం లేదంటూ మండిపడ్డారు. దీనికి అధికారులు స్పందించకనే ఎంపీ బీకే పార్థసారథి కల్పించుకుని పింఛన్లపై విచారణ చేపట్టి బోగస్‌ ఏరివేసిన తర్వాత కొత్తవి ఇస్తామని బదులిచ్చారు. తొలగింపులు సరే కొత్తవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మిగతా సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే ఎంపీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు వాగ్వాదానికి దిగారు.

ప్రజారోగ్యం పట్టదా?

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యం గురించి పట్టదా అని పలువురు సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని ఎంపీ బీకే పార్థసారథి తెలపగా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేదల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారని శివరామిరెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే ప్రైవేట్‌ ఆస్పత్రుల పేర్లను సూచించే బోర్డులను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బు కట్టించుకుని వైద్యం చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎటువంటి ప్రణాళికలు తయారు చేశారని ప్రశ్నించారు. దాదాపు 750 పనులకుగాను 400 పూర్తి చేశామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌ సమాధానమిచ్చారు. కొనకొండ్ల పంచాయతీలో ఇప్పటి వరకు పనులే పూర్తి చేయలేదని శివరామిరెడ్డి తెలపగా.. త్వరలోనే పూర్తి చేస్తామని ఎస్‌ఈ హామీ ఇచ్చారు. అనంతపురం జెడ్పీటీసీ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో 108 అంబులెన్సులు సరైన సమయానికి రావడం లేదన్నారు. జిల్లాలో ఎన్ని అంబులెన్సులు ఉన్నాయి.. ఎన్ని పనిచేస్తున్నాయో చెప్పాలని కోరారు. అధికారులు స్పందిస్తూ 108 అంబులెన్సులను థర్డ్‌ పార్టీకి ఇచ్చామని, త్వరలోనే సమస్య కొలిక్కి వస్తుందని చెప్పారు. జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు వేతనాలు సక్రమంగా రావడం లేదని, కుటుంబ పోషణకు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. సత్యసాయి తాగునీటిని ఏ విధంగా సరఫరా చేస్తారో పంచాయతీ నీరు అంతే సురక్షితంగా అందించాలని కోరారు.

కాంట్రాక్టర్‌పై చర్యలు

తీసుకోకుంటే ఆమరణరదీక్ష

అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుంటే కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆమరణదీక్ష చేస్తానని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. తల్లీబిడ్డలకు అందించే కోడిగుడ్లను నెలలో ఐదు రోజులు కూడా సరఫరా చేయలేదన్నారు. ఇటువంటి వారిని క్షమించరాదన్నారు. కార్యక్రమంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

శిక్షణకు వెళ్లనున్న కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం అర్బన్‌: ఐఏఎస్‌ అధికారులకు ఇచ్చే మిడ్‌ కేరీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వనున్న శిక్షణకు కలెక్టర్‌ ఆనంద్‌ హాజరుకానున్నారు. ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు ముస్సోరీలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)లో శిక్షణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం బయలుదేరి వెళ్లనున్నారు. కలెక్టర్‌ తన శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేవరకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.

స్టూడెంట్‌ను కొట్టారని మహిళా టీచర్‌పై దాడి

గుంతకల్లుటౌన్‌: విద్యార్థినిని కొట్టారని ఆగ్రహోదగ్రులైన కుటుంబ సభ్యులు పాఠశాలలోకి చొరబడి మహిళా టీచర్‌పై మూకుమ్మడిగా దాడిచేసిన ఘటన గుంతకల్లులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఉమామహేశ్వరనగర్‌లోని కాంతి కిరణ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో శనివారం మధ్యాహ్నం భోజన విరామానికి గంట కొట్టగానే విద్యార్థులు క్లాసుల్లోంచి తోసుకుంటూ బయటకు వచ్చారు. గమనించిన గౌసియా అనే టీచర్‌ క్యూలో వెళ్లండంటూ మూడో తరగతి విద్యార్థిని ఆస్మాతో పాటు మరికొంతమంది విద్యార్థులను బెత్తంతో కొట్టింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని ఆస్మా తల్లిదండ్రులు, బంధువులు మూకుమ్మడిగా పాఠశాలలోకి చొచ్చుకొచ్చారు. అక్కడ అందరి ముందూ టీచర్‌ గౌసియాపై దాడిచేశారు. కరస్పాండెంట్‌ ఊరెళ్లారని, వచ్చాక మాట్లాడుదామని సర్దిచెప్పబోయిన ఓ విద్యార్థి తల్లితోపాటు ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఇర్ఫాన్‌, సిద్దసాయిపైనా వారు చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు స్కూల్‌కు చేరుకుని విద్యార్థిని బంధువులు, స్కూల్‌ టీచర్లను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. ఉద్దేశపూర్వకంగానే టీచర్‌ బెత్తంతో కొట్టి తమ కూతురు చేయిని గాయపరిచిందని తల్లిదండ్రులు ఆరోపించారు. సీఐ మనోహర్‌ జరిగిన ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు, టీచర్లను విచారణ చేశారు. అదే సమయంలో టీచర్‌ గౌసియా సీఐ చాంబర్‌లో కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్‌ డేగా జరుపుకున్న రోజునే టీచర్‌పై దాడి జరగడాన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది.

చేతి గాయాన్ని చూపుతున్న విద్యార్థిని, టీచర్‌ను విచారణ చేస్తున్న సీఐ

బెదిరింపు

ఆర్డీటీ

రెన్యూవల్‌పై

ఎంపీ తడబాటు

108 అంబులెన్సులు సకాలంలో రావడం లేదు

ఆరోగ్యశ్రీ సేవలందక పేదల జేబులకు చిల్లు

జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకపోవడంతో పేదలకు సేవా కార్యక్రమాలు అందడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ ఎప్పు చేయిస్తారని ప్రశ్నిస్తే.. ఎంపీ బీకే పార్థసారథి స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఆర్డీటీని నిర్వీర్యం చేస్తే తాము ఇప్పుడు రెన్యూవల్‌ చేయించామని చెప్పారు. ఆర్డీటీకి ఇప్పటి వరకూ రెన్యూవల్‌ ఉత్తర్వులు రాకపోతే తప్పుడు సమాధానం ఎలా చెప్తారని సభ్యులు నిలదీశారు. తడబాటుకు గురైన ఎంపీ.. త్వరలో రెన్యూవల్‌ చేయిస్తాం అంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. కేరళలో పేదరిక నిర్మూలన విజయవంతంగా చేపట్టారని, అక్కడ అనుసరించిన విధానాలను ఏపీలోనూ అమలు చేయాలని నల్లమాడ జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. దీనికి ఎంపీ బీకే కల్పించుకొని గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, అప్పులు చేయడంతో లోటుబడ్జెట్‌లో ఉందని, తమ ప్రభుత్వం సంపద సృష్టించి.. అభివృద్ధి చేస్తుందని అన్నారు. దీంతో పలువురు సభ్యులు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో అప్పులు ఎన్ని.. మీ రెండేళ్ల పాలనలో ఎంత అప్పు చేశారో మీకు తెలియదా అని చురకలంటించారు.

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?1
1/5

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?2
2/5

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?3
3/5

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?4
4/5

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?5
5/5

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement