జ్వరంతో విద్యార్థిని మృతి
పెద్దవడుగూరు: జ్వరంతో విద్యార్థిని మృతి చెందిన ఘటన మండల పరిధి లోని క్రిష్టిపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రఘురామ్ కుమార్తె యశ్వకీర్తి (15) యాడికి మండలం తూట్రాళ్లపల్లి మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 15 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో బాలికను ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. స్థానిక ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు యశ్వకీర్తిని కర్నూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుండెకు నీరు చేరిందని నిర్ధారించిన అక్కడి డాక్టర్లు చికిత్స కొనసాగించారు. అయితే, చికిత్స ఫలించక యశ్వకీర్తి మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం మృతదేహానికి స్వగ్రామం తీసుకొచ్చారు. మృతదేహం వద్ద స్నేహితులు, టీచర్లు నివాళులర్పించారు.


