
8.2 కేజీల గంజాయి స్వాధీనం
● ముగ్గురు నిందితుల అరెస్ట్
అనంతపురం: గుట్టుగా విద్యార్థులకు విక్రయిస్తున్న 8.2 కేజీల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. అనంతపురంలోని బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి ఆంజనేయులు భార్య షికారి నాగమణి, షికారి గంగులు కుమారులు షికారి శీనా, షికారి జునలు స్థానిక టీవీ టవర్ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీ మసీదు వద్ద గంజాయి విక్రయాలు చేపడుతునారు. కొన్ని రోజులుగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల, ఇంటర్ విద్యార్థులు వీరి నుంచి గంజాయి కొంటున్నారు. సోమవారం ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు.. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. మూడు సంచుల్లో 8.291 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి సుహాసిని, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎం. సత్యనారాయణ, ఎస్‌ఐలు నరేష్ బాబు, జయనరసింహ, జాకీర్ హుస్సేన్, సిబ్బంది మారుతి, రమేష్ రెడ్డి, మీనా లక్ష్మి, నాగముని పాల్గొన్నారు.