
మిన్నంటిన ఆందోళన
బుక్కరాయసముద్రం: కూటమి ప్రభుత్వం అన్యాయంగా దివ్యాంగుల పింఛన్లు తొలగించడంపై బీకేఎస్ మండలంలో ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం మండల కేంద్రంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతపురం–తాడిపత్రి రహదారిపై బైఠాయించారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే దివ్యాంగుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. ఈ ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఆందోళన చేస్తున్న దివ్యాంగులు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రంమలో జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరి కూటి కాటమయ్య, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, కాటమయ్య, నిమ్మల భాస్కర్, చికెన్ నారాయణస్వామి, రాజారెడ్డి, నాగేశ్వరరెడ్డి, నగేష్ పాల్గొన్నారు.

మిన్నంటిన ఆందోళన