
హెచ్‌ఎం అసోసియేషన్ నూతన కార్యవర్గం
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం (హెచ్‌ఎం) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా హెచ్‌ఎంల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 2025–27 కాలానికి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జయరామి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా హరినాథ్, గౌరవాధ్యక్షులుగా బాలమురళీకృష్ణతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా విజయభాస్కర్ రెడ్డి, మల్లికార్జున, నారాయణరెడ్డి, హెడ్‌క్వార్టర్ విభాగం కార్యదర్శిగా రోషన్‌బాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మదన్‌మోహన్ రెడ్డి, మహిళా విభాగం ప్రతినిధిగా వసుంధర, మునిసిపాలిటీ విభాగం ప్రతినిధిగా శామ్సన్, అనంతపురం డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా బీసీ సుంకన్న, జాయింట్ సెక్రటరీగా పీఆర్‌వీ ప్రసాద్, కళ్యాణదుర్గం డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఈ. గోవిందప్ప, జాయింట్ సెక్రటరీగా ఆదిశేషయ్య, గుంతకల్లు డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. సుంకన్న, జాయింట్ సెక్రటరీగా ఎం. శివ శంకర్ రెడ్డి, టెక్నికల్ కమిటీ సభ్యులుగా కే వెంకటప్రసాద్, గోపాల్ నాయుడు, అబ్దుల్ మునాఫ్, ఆడిట్ కమిటీ సభ్యులుగా ఎం. విశ్వనాథ్, సూర్యనారాయణ, శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
జిల్లా అధ్యక్షుడిగా జయరామిరెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ