‘రిక్వెస్ట్’ కాస్త ‘కంపల్సరీ’ అయింది
● తాడిపత్రిలోని ప్రభుత్వ స్కూల్‌లో పని చేస్తున్న బయాలజీ సైన్స్ టీచరు మరో 8 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. నాలుగేళ్లుగా ఆమె ఈ స్కూల్‌లోనే పనిచేస్తున్నారు. ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపురంలో ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతపురం స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పని చేస్తున్న స్కూల్ కనబరిచి సబ్‌మిట్ చేయబోతే సిస్టం అంగీకరించలేదు. తప్పనిసరి బదిలీల టీచర్లు లాగానే జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది.
● ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్‌వేర్
● రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే ‘కంపల్సరీ’గా చూపిస్తున్న వైనం


