●జనం నెత్తిన ‘రేషన్ బరువు’
ఇంటి వద్దకు వాహనం వచ్చినప్పుడు రేషన్ తీసుకుంటూ వచ్చిన కార్డుదారులకు... ఇప్పుడు ‘నెత్తిన రేషన్ బరువు’ మోయాల్సిన దుస్థితి పట్టింది. ఇంటింటికీ రేషన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడి... చౌక దుకాణాల ద్వారానే అందజేసే విధానం తేవడంతో కార్డుదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలికినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దీంతో వృద్ధులు స్లోర్ల వద్దకు వచ్చి బియ్యం, సరుకులు తీసుకుంటున్నారు. రేషన్ పంపిణీ మొదలైన రెండో రోజు సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా కార్డుదారులు అవస్థలు పడ్డారు. – అనంతపురం అర్బన్/సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
●జనం నెత్తిన ‘రేషన్ బరువు’


