పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాలు కీలకం
అనంతపురం కార్పొరేషన్: పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాల పాత్ర ఎంతో కీలకమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ హరిప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టి.సురేంద్రరెడ్డి అన్నారు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం వారు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీను బలోపేతం చేయడానికి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారికి వివిధ పదవులతో జగనన్న గుర్తింపునిచ్చారన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలతో మమేకమై పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలన్నారు. ప్రజల పక్షాన నిలిచి వైఎస్సార్ సీపీ అధిష్టానం దశలవారీగా పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హరిప్రసాదరెడ్డి, సురేంద్ర రెడ్డిని అనుబంధ విభాగాల అధ్యక్షులు సన్మానించారు. కార్యక్రమంలో యువజన విబాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు అమర్‌నాథరెడ్డి, వైపీ బాబు, మల్లెమీద నరసింహులు, కురుబ దేవేంద్ర, మూడే శ్రీనివాసులు నాయక్, రాజశేఖరరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, కె శ్రీనివాసరెడ్డి, ఎం ధనుంజయ, సి.నాగప్ప, ఓబిరెడ్డి, ఎంసీ సంధ్యారాణి, శ్రీదేవి, రిలాక్స్ నాగరాజు, వై.నరేంద్రరెడ్డి, సైఫుల్లాబేగ్ పాల్గొన్నారు.


