హామీలిచ్చి మోసం చేయడం ఆయనకు కొత్తకాదు. ఎన్నికలకు ముందు
సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పగ్గాలు చేపట్టి ఏడాది కావొస్తున్నా హామీలు అమలు కావడం లేదు. మేనిఫెస్టోను చిత్తుకాగితంలా భావించిన సీఎం చంద్రబాబు సామాన్యుల నోట మట్టికొట్టారు. ఈ క్రమంలో జిల్లాలో నేడు ఏ పల్లెకు వెళ్లినా, ఏ గల్లీకి వెళ్లినా కూటమి సర్కారు మోసాల గురించి చర్చలు సాగుతున్నాయి.గత ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఏ పథకానికి ఎంత సొమ్ము ఇవ్వాలో బటన్ నొక్కి మరీ వారి ఖాతాలోకి జమ చేశారు. తాజా పరిస్థితుల్లో ‘పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు’ను తెచ్చుకున్నామన్న చందంగా పరిస్థితి తయారైందని గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
● ఎన్నికల వేళ సూపర్‌సిక్స్ పథకాలపై చంద్రబాబు డప్పు
● అధికార పగ్గాలు చేపట్టాక హామీలన్నీ గాలికి
● ఏడాది పూర్తవుతున్నా ఒక్క రూపాయీ అందించని వైనం
● మండిపడుతున్న లబ్ధిదారులు
హామీలిచ్చి మోసం చేయడం ఆయనకు కొత్తకాదు. ఎన్నికలకు ముందు


