ప్రాణం బలిగొన్న అతి వేగం
రాప్తాడు: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని దేవనహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్ (44), ప్రతాప్, అమర్‌నాథ్, నగేష్... కేఏ50ఏ 9691 నంబర్ గల కారులో మంత్రాలయ క్షేత్ర దర్శనానికి వెళ్లారు. అక్కడ పూజాదికాలు ముగించుకున్న అనంతరం శుక్రవారం దేవనహళ్లికి తిరుగు ప్రయాణమయ్యారు. రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఘటనలో కారు నడుపుతున్న మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్, అమర్‌నాథ, నగేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ప్రాణం బలిగొన్న అతి వేగం


