దేవదాయ శాఖకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి
పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలలో ప్రభుత్వ నిర్వాకం వల్ల భక్తిభావం దెబ్బతింటోంది. తొలుత ప్రభుత్వ పెత్తనం లేకుండా ఎండోమెంటును తప్పించాలి. ట్రస్టులు, మఠాల ఆధ్వర్యంలో సాగే క్షేత్రాలలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ప్రభుత్వ ఆధీనంలోని ఆలయాల్లోనే ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. సింహాచలం ఘటనకు బాధ్యులైన ఇంజనీరు, ఈఓను బాధ్యతల నుండి తప్పించాలి. కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించాలి. – సీహెచ్ విశ్వేశరరెడ్డి,
అధ్యక్షుడు, హిందూ చైతన్యవేదిక


