సజావుగా పాలిసెట్
అనంతపురం: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పాలిసెట్ బుధవారం జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగింది. మొత్తం 8,910 మంది విద్యార్థులకు గాను 7,908 మంది (88.75 శాతం) హాజరయ్యారు. బాలురు 5,351 మందికి గాను 4,819 (90.06 శాతం), బాలికలు 3,559 మందికి గాను 3,089 మంది (86.79 శాతం) హాజరయ్యారు. అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ సి.జయచంద్రా రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలను పాలిసెట్ జిల్లా పరిశీలకులు డాక్టర్ ఎంవీ ఎస్‌ఎస్‌ఎన్ ప్రసాద్, అనంతపురం నగర పరిశీలకులు వై.సురేష్ పర్యవేక్షించారు.
88.75 శాతం హాజరు
సజావుగా పాలిసెట్


