ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతులు చేపట్టాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కోర్టు కేసులతో ఆగిపోయిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల కేసులో కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే పదోన్నతులు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో నిలిచిపోయిన పీఎస్ హెచ్‌ఎం పోస్టులను వెంటనే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ సర్వీసు రూల్స్, మున్సిపల్ సర్వీసు రూల్స్ వేరుగా ఉన్నందున ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆగిపోయిన మున్సిపల్ ఉపాధ్యాయుల ఇంగ్ల్లిష్ పదోన్నతులను చేపట్టాలన్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న లోపాలను సరి చేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు సూర్యుడు, చంద్రశేఖర్, ఫణి భూషణ్, సుగుమంచి సురేష్, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.


