కో ఆర్డినేషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయండి
అనంతపురం కల్చరల్: సమాచార హక్కు చట్టానికి సంబంధించి జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులకు సమాచార హక్కు పరిరక్షణ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి మలోలను సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు హొన్నూరప్ప, సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లాలే నాయక్, రాయల్ కొండయ్య, ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు కేపీ రాజు తదితరులు గురువారం కలసి మాట్లాడారు. ఇద్దరు ఆర్‌టీఐ కార్యకర్తలతో కలిసిన కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తే పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డీఆర్వోను కలిసిన వారిలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమామ్, నబీరసూల్, అనంతకుమారి, సెక్రటరీలు మహేష్‌కుమార్, భానుకిరణ్, గణేష్, రామాంజనేయులు, మల్లేశ్వరి తదితరులున్నారు.
డీఆర్వోకు స.హ.చట్ట పరిరక్షణ సంఘం విజ్ఞప్తి


