ఉత్తమ అవార్డు అందుకున్న కలెక్టర్
● ‘స్వచ్ఛ ఆంధ్ర’ సమర్థ నిర్వహణకు...
అనంతపుర అర్బన్: స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డును కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అందుకున్నారు. గురువారం మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం– 2025 కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ అందుకున్నారు. ఓడీఎఫ్ ప్లస్ కింద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల పరిధిలో సమర్థవంతంగా నిర్వహించి అన్నింటినీ ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్నారు.
కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తు
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని కురుగుంట కేజీబీవీలో ఖాళీగా ఉన్న మూడు అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ–1 వెంకటస్వామి, ఎంఈఓ–2 సరితారాణి తెలిపారు. గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30లోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 2024 జూలై 1 నాటికి 42 ఏళ్లు పూర్తయి ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్ వారు 47 ఏళ్లు, దివ్యాంగులు 52 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మాజీ సర్వీస్ మహిళలకు 45 ఏళ్ల వయసు వరకు అర్హులని తెలిపారు. స్థానిక మహిళలు (గ్రామం/మండలం) మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
అధ్యాపకులకు
శిక్షణ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలవుతున్న సీబీఎస్‌ఈ, సిలబస్, ప్రశ్నపత్రాల మార్పు తదితర అంశాలపై జూనియర్ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ గురువారం ప్రారంభమైంది. స్థానిక కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగిన శిక్షణకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులు హాజర య్యారు. ఆన్‌లైన్ విధానంలో జరిగిన శిక్షణను ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయా సబ్జెక్టుల నిఫుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి ఎం.వెంకటరమణనాయక్ మాట్లాడుతూ అధ్యాపకులకు ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. నూతన సిలబస్, సంస్కరణలపై శిక్షణ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కేఎస్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ పాల్గొన్నారు.
కొత్తగా నాలుగు
మద్యం షాపులు
అనంతపురం: జిల్లాలో కొత్తగా తాడిపత్రి మున్సిపాలిటీలో మూడు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఒక మద్యం షాపు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పి. నాగమద్దయ్య, జిల్లా ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2 లక్షలు (నాన్ రీ ఫండబుల్) డీడీ ద్వారా చెల్లించి, దరఖాస్తుకు ఆధార్ కార్డు జత చేసి మ్యానువల్‌గా జిల్లాలోని అన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తు చేయవచ్చన్నారు. absbcl.gov.in వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
30న పాలిసెట్
అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 30న ఏపీ పాలిసెట్–2025ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సి. జయచంద్రా రెడ్డి తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను www.polycetap.nic.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఉత్తమ అవార్డు అందుకున్న కలెక్టర్


