అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాలు ఉండగా.. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదనంగా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. కొత్త పరీక్ష కేంద్రాలు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 98665 59653, 90523 16764 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
అదనంగా పెంచిన కేంద్రాలివే..
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, కళ్యాణదుర్గం
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, శింగనమల (అనంతపురం రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన)
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, నార్పల (అనంతపురంలోని కొత్తూరు బాలుర జూనియర్ కళాశాల)
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, నార్పల (అనంతపురం హౌసింగ్‌బోర్డు మెయిన్ రోడ్డు ఎస్‌వీఆర్ కేఫ్ పక్కన)
● ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం, రాయదుర్గం
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక, అరవిందనగర్)
● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, మోడల్ స్కూల్ దగ్గర ధర్మవరం


