మండుటెండలు మనుషులనే కాదు పంటనూ దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో పొలంలో నాటిన అరటి పిలకలను కాపాడుకునేందుకు రైతులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డికి చెందిన రైతు ఆదినారాయణరెడ్డి ఇటీవల తన పొలంలో అరటి పిలకలు నాటారు. ఎండ వేడిమి నుంచి పిలకలకు రక్షణకు కల్పించేందుకు పాతదినపత్రికలతో గుడారాలను ఏర్పాటు చేశాడు. అలాగే నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు మురళీమోహన్‌రెడ్డి సైతం తాను నాటిన అరటి పిలకలకు రక్షణగా ఈత ఆకులను గుడిసెలా ఏర్పాటు చేశాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: